calender_icon.png 14 January, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండపోచమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

14-01-2025 01:33:31 AM

జగదేవపూర్, జనవరి 13: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే   కొండపోచమ్మ  జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైంది.  కోరిన కోర్కెలు తీర్చే  కొంగు బంగారంగా  పేరుగాంచిన కొమురవెల్లి మల్లన్న చెల్లెలుగా ప్రఖ్యాతి  గాంచిన కొండ పోచమ్మ  జాతర ఉత్సవాలు ప్రతి ఏటా బోగి పండుగ రోజు అమ్మవారి సన్నిధిలో  బైండ్ల పూజారులు  వేసిన పటంతో మొదలవుతాయి.

సోమవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అందంగా అలంకరించారు. గర్భాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రధానమండపంలో  బైండ్ల పూజారులు పట్నం వేసి పూజలు చేశారు.  అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు  అనుమతి ఇవ్వడంతో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో రవికుమార్ మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం భోగి రోజు ప్రారంభమయ్యే అమ్మవారి జాతర ఉత్సవాలు ఉగాది వరకు జరుగుతాయన్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనం అనంతరం భక్తులు కొండపోచమ్మ ను దర్శించుకునే ఆనవాయితీ అనాదిగా వస్తుందన్నారు.

రాష్ట్ర నలుమూలల తో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని ఈవో రవికుమార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తీగుల్ నర్సాపూర్  మాజీ సర్పంచ్ రజిత రమేష్, తీగుల్ మాజీ సర్పంచ్ భాను ప్రకాష్, దేవాలయ డైరెక్టర్లు అగమల్లు, నరేష్, సిబ్బంది రమేష్, లక్ష్మణ్, హరిబాబు, దుర్గ ప్రసాద్, పాల్గోన్నారు.