నారాయణఖేడ్, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా మన ఊరు మండలంలో ప్రసిద్ధి చెందిన బోరంచ నల్ల పోచమ్మకు పోటెత్తిన భక్తులు, శుక్రవారం మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనలు కొనసాగాయి. అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ప్రముఖ న్యాయవాది ఇంద్రసేనారెడ్డి, పూజారులు పాల్గొన్నారు.