calender_icon.png 26 February, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు...

26-02-2025 03:51:00 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా కుక్కట్ పల్లి  జంట సర్కిల్ పరిధిలోని పలు శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. బాలానగర్, ఫతేనగర్, కెపిహెచ్బి కాలనీ, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ శివాలయాలలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. శివలింగానికి అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన శివుడికి అభిషేకం చేస్తే  మంచి జరుగుతుందని భక్తులు పేర్కొన్నారు.