27-02-2025 09:16:19 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని సోమలింగేశ్వర ఆలయంలో గురువారం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు ఉదయం నుంచి భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టిన పలువురు భక్తులు ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొని ఉపవాస దీక్షలను విరమించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సోమలింగేశ్వర ఆలయానికి బాన్సువాడ నస్రుల్లాబాద్ బీర్కూర్ మద్నూర్ బిచ్కుంద జుక్కల్ తదితర మండలాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున రావడంతో భక్తులతో సోమ లింగేశ్వర ఆలయం కిటకిటలాడింది. నస్రుల్లాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.