26-02-2025 06:30:18 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్ శివాలయాలు భక్తజనంతో పోటెత్తాయి. వేకువ జామునే భక్తులు సమీప మల్లేపల్లి ప్రాంతంలోని గోదావరి నది తీరానికి వెళ్లి పుణ్యస్నానమాచరించి మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వరాలయంకు చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో శివలింగాన్ని దర్శించుకున్నారు. మణుగూరు లోనే శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శివలింగాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
శివయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు. తొలుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు సభ్యులు దేవాదాయ శాఖ ఆలయ సంప్రదాయంగా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, అశ్వాపురం, కొండాయిగూడెం తదితర సమీప ప్రాంతాల్లోని శివాలయాలను దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలయాలను సందర్శించి శివలింగాన్ని దర్శించుకున్నారు.
మణుగూరు మండల పరిధిలోని కొండాయిగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత వైద్య లింగేశ్వర ఆలయాన్ని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిపిఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య సందర్శించి శివలింగాన్ని దర్శించుకున్నారు. మణుగూరు సిఐ హోమ సతీష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పక్కనే ఉన్న గోదావరిలో పుణ్యస్నాలచరించి శివయ్యను దర్శించుకున్నారు. శివాలయాలకు మణుగూరు మండలంలోని నాయకులు ప్రముఖులు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని భక్తిశ్రద్ధలతో ముక్కులు తీర్చుకున్నాడు దీంతో మణుగూరు మండల పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి.
మొక్కలు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే రేగా...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం మణుగూరు లోని శ్రీ నీలకంటేశ్వరాలయాన్ని సందర్శించి శివలింగాన్ని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గోదావరి వద్ద భారీ బందోబస్తు..
భక్తులు మణుగూరులోని మల్లేపల్లి కొండాయిగూడెం గోదావరి నది తీరాలకు పుణ్యస్నారాచరించినందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. గోదావరి లోతుకు వెళ్లకుండా హెచ్చరిస్తూ ఎటువంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా డి.ఎస్.పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ సతీష్ కుమార్, ఎస్ఐలు మేడా ప్రసాద్, రంజిత్ లు బందోబస్తు నిర్వహించారు.