- వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు
- స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం
చేర్యాల, జనవరి 19: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు మొదటి (పట్నం) ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మల్లన్న క్షేత్రంలోని కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆలయంలోని గంగిరేణు చెట్టుకింద పట్నా లు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మల్లన్నను దర్శించుకోడానికి కిలో మీటర్ వరకు భక్తులు బారులుతీరారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. రాత్రి తోటబావి వద్ద యాదవులు ఒగ్గు కళాకారులచే పెద్దపట్నాన్ని రచింపజేసి, అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. సోమవారం అగ్నిగుండాలను, పెద్ద పట్నాలను తొక్కి మరోసారి మల్లన్నను దర్శించుకుని సమీపంలోని కొండపోచమ్మ దర్శానానికి వెళ్తారు.