పాపన్నపేట నవంబర్ 24 : కార్తీకమాసం ఆదివారం సెలవు దినం కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మెదక్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. భక్తులు మంజీరా నది వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు.