calender_icon.png 27 February, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు

27-02-2025 12:00:00 AM

చింతల చెరువు శివాలయానికి పోటెత్తిన భక్తులు 

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామస్మరణంతో శివాలయాలు మారుమో గాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. శివరాత్రి రోజు శివుని దర్శనం చేసుకుంటే పాపాలు పోతాయని నమ్మిక తో భక్తులు పోటెత్తారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాత పాల్వంచ శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం అతి పురాతన 13వ శతాబ్దంలో కాకతీయ రాజు శ్రీ ప్రతాపరుద్ర మహారాజు పరిపాలనలో నిర్మించబడి.

తెలంగాణ రాష్ర్టంలోనే మహాశివరాత్రి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే తొలి కిరణాలు శివలింగంపై ప్రసరింపబడే ఏకైక దేవాలయం శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం కావడంతో ఇంతటి ఘన కీర్తి కలిగిన ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ ఉదయం 11గంటల వరకు కొనసాగింది. వేల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త మచ్చ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

భద్రాచలంలో...

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐటిడిఏ ప్రాంగణంలోని శివాల యంలోని శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారిని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ దంపతులు దర్శించుకొని అభిషేక నిర్వహించారు.

మణుగూరులో..

మణుగూరు సబ్ డివిజన్ శివాలయాలు భక్తజనంతో పోటెత్తాయి.. మణుగూరు లోనే శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శివలింగాన్ని ఎమ్మెల్యే పాయం వెంక టేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శివయ్యకు పట్టు వస్త్రాలు సమ ర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు. తొలుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు సభ్యులు దేవాదాయ శాఖ ఆలయ సంప్రదాయంగా సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, అశ్వాపురం, కొండాయిగూడెం తదితర సమీప ప్రాంతాల్లోని శివాలయాలను దర్శించుకున్నారు. మండలంలోని కొండాయిగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత వైద్య లింగేశ్వర ఆలయాన్ని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిపిఐ రాష్ర్ట నాయకులు బొల్లోజు అయోధ్య సందర్శించి శివలింగాన్ని దర్శించుకున్నారు. మణుగూరు సిఐ హోమ సతీష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి  గోదావరిలో పుణ్యస్నాలాచరిం చి శివయ్యను దర్శించుకున్నారు.

మొక్కులు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే రేగా...

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం మణుగూరులోని శ్రీ నీలకంటేశ్వరాలయాన్ని సందర్శించి శివలింగాన్ని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇల్లెందు నియోజక వర్గంలో..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణం, ఇల్లందు, టేకుల పల్లి మండలాల్లో బుధవారం దేవాలయా లు భక్తులతో కిటకిటలాడాయి. ఇల్లందు పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న శివాలయంలో భక్తులు వేకువజాము నుంచే వెళ్లి అభిషేకాలు చేశారు. ఇల్లందు సమీపంలోని కోటిలింగాలలో భక్తులతో సందడి నెలకొం ది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇల్లం దు పట్టణంలోని జెకె కాలనీ సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో జాగారం చేసే భక్తు ల కోసం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో భక్తి వల్లరి ఏర్పాటు చేశారు. టేకుల పల్లి మండల కేంద్రంలోని శ్రీ గోవిందాంబ సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో తెల్లవారు జాము నుంచి అభిషేకాలు నిర్వహించగా, మధ్యాహ్నం వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం నిర్వహించగా, రాత్రి పార్వ తి పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తారు.