calender_icon.png 30 January, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాలో అపశ్రుతి.. 20 మంది మృతి

29-01-2025 11:38:59 AM

ప్రయాగ్ రాజ్,(విజయక్రాంతి): కుంభమేళా(Kumbh Mela)లో అపశ్రుతి నెలకొంది. మహా కుంభమేళా సందర్భంగా బుధవారం నాడు మౌని అమావాస్య(Mauni Amavasya) కావడంతో పవిత్ర స్నానానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. దీంతో సంగమం ఘాట్(Pavithra Sangamam Ghat)లో అధిక రద్ధి కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా చనిపోగా, 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన అధికారులు బాధితులను అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ తొక్కిసలాట ఘటన ప్రయాగ్ రాజ్ లో సెక్టర్ 2 ప్రాంతంలో జరిగింది. మేళా ప్రత్యేక విధి అధికారి ఆకాంక్ష రాణా మాట్లాడుతూ... ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్ద భక్తులు అధిక సంఖ్యలో రావడంతోనే బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాట జరిగిందన్నారు.

ఈ ఘటనలో కొంతమంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. మహాకుంభమేళాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళా సంఘటనపై ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Uttar Pradesh CM Yogi Adityanath)తో ఇవాళ మూడుసార్లు మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ధేశించారు.మౌని అమావాస్య నాడు జరిగే అమృత స్నానం మహా కుంభమేళాలో అత్యంత ముఖ్యమైన ఆచారం, దాదాపు 10 కోట్ల మంది యాత్రికులను వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం, 144 సంవత్సరాల తర్వాత వచ్చే త్రివేణి యోగం అనే అరుదైన ఖగోళ అమరిక జరుగుతోంది.  ఇది ఇవాళ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది.