calender_icon.png 10 January, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలి

31-12-2024 04:45:46 PM

అధికారం ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఐటిడిఏ పిఓ రాహుల్ అధికారం ఆదేశించారు. ముఖ్య కూడళ్ళలో భక్తులు అధికంగా బస చేసే ప్రదేశాలలో టెంపరరీ టాయిలెట్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. మంగళవారం భద్రాచలంలోని కాపా రామ లక్ష్మి, కరకట్ట పక్కన ఉన్న తాత్కాలికంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు బస చేసే ప్రదేశాలలో మంచినీటి సమస్య రాకుండా టాయిలెట్లు నిర్మించాలని, స్నానాలు గదులు కూడా అందుబాటులో ఉండాలని అన్నారు. గ్రామపంచాయతీ ద్వారా మంచినీటి సౌకర్యం కొరత లేకుండా చూడాలని అన్నారు.

అనంతరం గోదావరి కరకట్ట ప్రదేశాలలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించి జనాలు ఎక్కువ వచ్చే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి గిరిజన కల్చర్కు సంబంధించిన వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే విధంగా చూడాలని అన్నారు. అనంతరం ఉత్తర ద్వారా దర్శనం ప్రదేశాలను పరిశీలించి భక్తులు రాత్రిపూట బసజేసే ప్రదేశాలు, అధ్యయనోత్సవాలు ప్రారంభం దగ్గర నుంచి నిర్వహించే కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి దేవస్థానం ఈవో రమాదేవిని అడిగి తెలుసుకున్న అనంతరం షెడ్యూలు కులాలకు సంబంధించిన అనాధ శరణాలయాన్ని పరిశీలించి అనాధ శరణాలయం ముందు ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిఈ హరీష్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఈ రవీందర్రావు, డి ఈ వెంకటేశ్వర్లు, జేడీఎం హరికృష్ణ, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావు, టిఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.