calender_icon.png 4 March, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురికి నీటిలోనే భక్తుల స్నానాలు

04-03-2025 01:11:05 AM

బీఆర్‌ఎస్ పరిశీలనలో వెల్లడి 

 చేర్యాల,మార్చి 3: కొమురవెల్లి మల్లికార్జున క్షేత్రంలోని కోనేట్లులోని మురికి నీటితోనే భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారని టిఆర్‌ఎస్ మండల సీనియర్ నాయకులు ముత్యం నరసింహులు గౌడ్, ఎరుపుల మహేష్ అన్నారు.  మల్లన్న క్షేత్రంలోని కోనేటిని సోమవారం టిఆర్‌ఎస్ బృందం పరిశీలించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అధికారులు దృష్టికి అనేకసార్లు తీసుకుపోయినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. మురికి నీటిలోనే భక్తులు స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారన్నారు. భక్తుల మనోభావాలతోని ఆటలాడుకుంటున్నారని వారు ఆరోపించారు. కోనేరు నీటి శుద్ధికి శుద్ధి యంత్రం ఉన్నప్పటికీ, వాటిని వాడకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.

వెంటనే నీటి శుద్ధి యంత్రాన్ని వినియోగించి వినియోగంలోకి తేవాలన్నారు. ఎప్పటికప్పుడు కోనేట్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, కోనేరు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ శ్రీధర్,గోల్లపల్లి ఆంజనేయులు, బాలయ్య తదితరులు ఉన్నారు.