29-03-2025 08:10:29 PM
కొండాపూర్: శని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని కొండాపూర్ మండలం మాందాపూర్ శనిగట్ దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడింది. శనివారం శని అమావాస్య రావడంతో మాందాపూర్ శని దేవాలయంలో జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ కుటుంబ సమేతంగా వేద పండితుల మంత్రోచ్ఛారణతో శని దేవునికి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు. గొల్లపల్లి సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శని దేవునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేశారు. తెల్లవారుజామునుండేష్ మాందాపూర్ శని ఘాట్ దేవస్థానానికి సైదాపూర్ లోని శని దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయాల్లో శని నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.