నిర్మల్ ఆగస్టు 26 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలోని కదిలి అన్నపూర్ణ పాపేశ్వర ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరిం చుకున్నది. శ్రావణమాసం చివరి సోమవార ం, కృష్ణాష్టమి సెలవు కావడంతో భక్తులతో కిటకిటలాడింది. గంటల తరబడి క్యూ లైన్లలో బారులు తీరి గర్భగుడిలోని శివలింగా న్ని దర్శించుకున్నారు. బైంసాకు చెందిన సు దర్శన్ పటేల్ అనే భక్తుడు అన్నదానం చేశా రు. అలాగే జిల్లాలోని బ్రహ్మేశ్వర ఆల యం, సూర్యపూర్ రాజేశ్వరం డొంగురాం, సిరాల, గొడిసిర్యాల, ఓంకరేశ్వర, కోటిలింగాల ఆలయంలోనూ భక్తుల రద్దీ కనిపించింది.