మహాకుంభమేళాకు పోటెత్తుతున్న ప్రజలు
ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 2: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకే 90లక్షల మంది భక్తులు పవిత్రస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది.
వసంత పంచమి పురస్కరించుకుని సోమవారం రోజు భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. సోమవారం నాడు సుమారు 4-6కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తుంది. శనివారం 2.15కోట్ల మంది భక్తలు త్రివేణి సంగమంలో స్నానాలు చేసినట్టు తెలిపింది.
దీంతో త్రివేణి సంగమంలో 20 రోజుల్లోనే సుమారు 33 కోట్ల మంది భక్తులు పవిత్రస్నానాలు చేసినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. సంగమంలో 77 దేశాలకు చెందిన 118 మంది విదేశీ ప్రతినిధులు కూడా మహాకుంభమేళాలలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.