calender_icon.png 16 October, 2024 | 7:48 PM

గచ్చిబౌలి స్టేడియంలో దేవిశ్రీ మ్యూజిక్ ఈవెంట్..

16-10-2024 05:03:12 PM

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతర్

శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి స్టేడియాలను అభివృద్ధి చేస్తామని చెబుతుండగా స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ మాత్రం క్రీడా మైదానాలను వాణిజ్య కార్యక్రమాలకు అద్దెకు ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను స్పోర్ట్సు అథారిటీ బేఖాతరు చేస్తుంది. గచ్చిబౌలి స్టేడియంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతించారు. ఈనెల 19వతేదీన గచ్చిబౌలి ఫుట్ బాల్ స్టేడియంలో దేవిశ్రీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కోసం స్టేడియంలోని అథ్లెటిక్ ట్రాక్ పై భారీ సెట్ వేశారు. స్టేజి నిర్మాణం కోసం స్టేడియంలో రన్నింగ్ ట్రాక్ ధ్వంసం చేశారు. ఇలాంటి ఈవెంట్స్ వల్ల క్రీడాకారుల సాధనకు ఆటంకం అని క్రీడాభిమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్టేడియంను ఇటీవలే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి బాగు చేయించారు. స్టేడియాలను ఇకపై క్రీడేతర కార్యక్రమాల నిర్వహణకు, ఈవెంట్స్ ఇవ్వమని సీఎం స్వయంగా ప్రకటించాక కూడా స్పోరర్ట్స్ అథారిటీ తీరు మార్చుకోలేదు. దీనిపై క్రీడాకారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.