calender_icon.png 10 October, 2024 | 2:38 PM

ధూందాం.. గా దేవి నవరాత్రి ఉత్సవాలు

10-10-2024 12:13:52 PM

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన టేకులపల్లి లో కోదండ రామాలయం ఆవరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని ఢీ అండ్ గ్లాస్, క్లాసికల్ డ్యాన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్ నేషనల్ ఢీ షో పాటిస్పెటెడ్ తరుణ్, పండు మాస్టర్ గ్రూప్, ఇంటర్ నేషనల్ గ్లాస్,  క్లాసికల్ డ్యాన్స్ అమృత లచే కార్యక్రమం చేపట్టారు. స్థానిక చిన్నారులు కూడా డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొని చేపట్టిన నృత్యాలు అలరించాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యేని, కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కోరం సురేందర్, ఇస్లావత్ రెడ్యానాయక్, సిఐ తాటిపాముల సురేష్, ఎస్సై పోగుల సురేష్, నిర్వాకులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు.