13-02-2025 12:02:25 AM
విజయ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతోన్న చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే Titleను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా విడుదల చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకుల కు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా ‘కింగ్‌డమ్’ రూపొందుతోందని టీజర్ ద్వారా తెలిపారు.
‘కింగ్‌డమ్’ టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ని ర్మిస్తున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రం మే 30న విడుదల కానుంది.