calender_icon.png 11 April, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవరకొండ బంధన్ బ్యాంక్ మేనేజర్ పరారీ!

22-03-2025 02:05:20 AM

రూ.6 లక్షలతో ఉడాయింపు

నల్లగొండ, మార్చి 21 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దేవరకొం డలోని బంధన్ బ్యాంక్ మేనేజర్ ఎస్‌హెచ్‌జీ(మహిళా సం ఘాల సభ్యులు) సొమ్ముతో ఉడాయించా డు. వారు చెల్లించిన రూ.6 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయాడు. దీంతో బ్యాంకు ఎదుట పలు మహిళా సంఘాల సభ్యులు ఆందోళనకు దిగాయి. బంధన్ బ్యాంక్ దేవరకొండ శాఖలో 104 ఎస్‌హెచ్‌జీ గ్రూపులు (1309 మంది సభ్యులు) పొదుపు చేస్తున్నారు.

బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నారు. గతేడాది నవం  కొండమల్లేపల్లికి చెందిన సాయితేజ మహిళా సంఘం సభ్యులు ఒక్కొ  రూ.30 వేల రుణం తీసుకున్నారు. ఇందుకు ఒక్కో సభ్యురాలు వారానికి రూ.1400 చొప్పున 48 వారాలు చెల్లించాలి. ఈ మే  బ్యాంకు రికవరీ ఏజెంట్ అంజికి ఆ మొ  చెల్లించారు.

తమకు కొత ్తరుణం ఇవ్వాలని కోరగా వారి పేర అప్పు ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెప్పడంతో విషయం బయ  పొక్కింది. ఈ క్రమంలో మహిళలు రికవరీ ఏజెంట్ అంజని నిలదీ  డబ్బు మేనేజర్ హేమంత్‌షికి ఇచ్చినట్టు చెప్పాడు. దీంతో బంధన్ బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యా దు చేశారు.

బ్యాంకులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో 20 రో  కింద ఉన్నతాధికారులు విచారణ చేసి  మేనేజర్ హేమంత్ షి, క్యాషియర్ శ్రవణ్, సిబ్బంది రమావత్ పవార్, వంగూరి ఆంజనేయులు, రమావత్ చింటూను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన మేనేజర్ హేమంత్‌షి పరారీలో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.