calender_icon.png 23 November, 2024 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'మహా' కొత్త సీఎంపై ఉత్కంఠ.. కుర్చీ కోసం లొల్లి

23-11-2024 01:38:35 PM

నా కొడుకే సీఎం.. దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మెజారిటీ సాధించింది. దీంతో మహారాష్ట్ర కొత్త సీఎంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో పోటాపోటీ నెలకొంది. 220కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యం ఉంది. 125 స్థానాలతో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీ ఉంది. సీఎం రేసులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముందున్నారు. మరోవైపు అజిత్‌ పవార్‌నే సీఎం చేయాలని ఎన్సీపీ వర్గం పట్టు బడుతోంది. మహాయుతి గెలుపులో షిండేదే కీలకపాత్ర పోషించారు. దీంతో ఏక్‌నాథ్‌ షిండేనే మళ్లీ సీఎం అంటున్న శివసేన వర్గం చెబుతోంది. అటు తన కుమారుడే సీఎం అని దేవేంద్ర ఫడణవీస్ తల్లి సరితా ఫడణవీస్ అన్నారు. ప్రజల కోసం తన కుమారుడు దేవేంద్ర ఫడణవీస్ 24 గంటలూ కష్టపడతాడని పేర్కొన్నారు. ఒక్కరు ఉంటేనే భద్రంగా ఉంటుంది.. అది మోడీ వల్లే సాధ్యం అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.