calender_icon.png 4 December, 2024 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్!

04-12-2024 11:44:17 AM

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఖరారయ్యారు. ఫడ్నవీస్ పేరును దాదాపు ఖారారైనట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 5న ఆయన ప్రమాణం చేసే అవకాశముంది. ముంబైలోని విధాన్ భవన్‌లో జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశాల తర్వాత భారతీయ జనతా పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్న తర్వాత మధ్యాహ్నం సమయంలో మీడియా సమావేశం ద్వారా ముఖ్యమంత్రి ఎంపికను పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పదవీ విరమణ చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను అత్యున్నత పదవికి బీజేపీ ఎంపిక చేస్తుందని సర్వత్రా భావిస్తున్నారు. నవంబర్ 20న జరిగిన ఎన్నికల్లో 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 132 స్థానాలను గెలుచుకుని బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. బీజేపీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లతో కూడిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో ఉన్నాయి.