calender_icon.png 20 March, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా దేవేందర్ యాదవ్

01-05-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నియమితులయ్యారు. ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న దేవేందర్‌కు ఢిల్లీ కాంగ్రెస్ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. ఆయనకు ఢిల్లీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసు కున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇటీవల అరవింద్ సింగ్ లవ్లీ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో దేవేందర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.