calender_icon.png 24 November, 2024 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.2,750కోట్లతో అభివృద్ధి పనులు

24-11-2024 02:06:08 AM

  1. విజయోత్సవాల్లో భాగస్వాములు కావాలి 
  2. ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క లేఖ

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా రూ.2,750 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఈనెల ౨౬న ప్రారంభించనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. పనుల ప్రారంభోత్సవాల్లో భాగస్వాములు కావాలని  ఎమ్మెల్యేలకు మంత్రి శనివారం లేఖలు రాశారు. ఈ నిధుల్లో రూ.1,372 కోట్లు ఉపాధిహామీ నిధులు, రూ.1,378 కోట్లు సీఆర్‌ఆర్ నిధులని సీతక్క తెలిపారు.

ఆరోజు ప్రారంభించే పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా ముందుకు సాగాలన్నారు. రూ.2,750 కోట్లతో ఇందిరా మహిళాశక్తి ఉపాధి భరోసా (పశువుల పాకలు, కంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాలు), పొలంబాటలు, నర్సరీలు, జలనిధి (చెక్ డ్యాంలు, కుంటలు), గ్రామీణ మౌలిక వసతులు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.