calender_icon.png 13 March, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 81 కోట్లతో అభివృద్ధి పనులు

13-03-2025 12:42:59 AM

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

రాజేంద్రనగర్, మార్చి 1౨ (విజయక్రాంతి): రూ.81 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు.  నార్సింగి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్ల అనుసంధానం భవిష్యత్తు అవసరాలకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. బుధవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడారు.  81 కోట్లతో మున్సిపల్ లో ఆవశ్యకమైన అభివృద్ధి పనులను త్వరితగతిన చేయుటకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రూ.20 కోట్లతో కోకాపేట్ విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న బ్రిడ్జి నిర్మాణంతో పాటు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి సుందరీకరణ చేస్తామన్నారు.  రూ.11.50 కోట్ల తో రాయల్ ఫంక్షన్ హాల్ నుండి నార్సింగి జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్డు వెడల్పు , ఫుట్ పాత్  నిర్మాణం డివైడర్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

రూ 13 కోట్లతో కోకాపేట్ సర్కిల్ నుండి గండిపేట్ సాయిబాబా గుడి వరకు బీటీ రోడ్డు వెడల్పు, ఫుట్పాత్ నిర్మాణం డివైడర్ నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.10. కోట్లతో మంచిర్యాల బాలాజీ నగర్ లో మెయిన్ రోడ్డు కల్వర్టు నుంచి మూసీ నది వరకు బాక్స్ నిర్మాణం, రూ 1.50 లతో నార్సింగిలో ఆవు దూడ జంక్షన్ నిర్మాణం తదితర పనులు త్వరలో చేపడతామని పేర్కొన్నారు. మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ముదిరాజ్ కమిషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్,నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ నాగపూర్ణ శ్రీనివాస్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డి ఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు.