కోనరావుపేట, ఫిబ్రవరి 4: కోనరా వుపేట మండలంలో రూ.1.84 కోట్ల నిధుల తో అభివద్ధి పనులు చేపడతామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా అన్నారు. మంగళవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి అభివద్ధిలో భాగంగా మండలంలోనీ పలు గ్రామాల్లో పలు అభివద్ధి పనులు చేపట్టేం దుకు నిధులు మంజూరయ్యాయని అన్నారు.
పలు గ్రామాల్లో నూతనంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కషీతో మం డలానికి రూ.1.84 కోట్ల సిఆర్‌ఆర్ (ఎస్సిపీ) నిధులు మంజూరు కావడం జరిగింద న్నారు. సీసీరోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల వారికి ఫిరోజ్ పాషా తెలిపారు.