calender_icon.png 3 April, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు...

27-03-2025 08:34:53 PM

పనులు వేగవంతం చేయాలి..

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు..

సంగారెడ్డి (విజయక్రాంతి): సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో సిఎస్ఆర్ నిధులతో జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ఆర్ నిధుల వినియోగం పనుల పురోగతిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రిలో అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతుల మెరుగు కోసం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం ప్రహరీ గోడల నిర్మాణం మంచినీటి సరఫరా సదుపాయాల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అధునాతన పరికరాల కొనుగోలు ఆసుపత్రుల భవనాల మరమ్మత్తులు పేషంట్ల అదనపు బెడ్ల ఏర్పాటు అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి చిన్నారుల కోసం బొమ్మల ఏర్పాటు భవనాలకు పెయింటింగ్ పరిశుభ్రత వాతావరణం కల్పించడం తదితర అవసరాల కోసం సిఎస్ఆర్ నిధులు జిల్లాలో కేటాయించినట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 25 కోట్ల సిఎస్ఆర్ నేతలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లాలోని పరిశ్రమల యజమానులు సహకరించాలని కోరారు. పరిశ్రమల యజమాన్యాల సహకారంతో జిల్లాలో 2025-26 సంవత్సరానికి సంబంధించి సిఎస్ఆర్ నిధుల వినియోగాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పాఠశాలలు, వసతి గృహాలు, ఆసుపత్రుల అవసరాలను గుర్తించి, ముందస్తుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు, జిల్లాలోని పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.