calender_icon.png 18 January, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివద్ధి పనులను వేగవంతంగా చేయాలి

18-01-2025 01:52:18 AM

గద్వాల, జనవరి 17 (విజయక్రాంతి) : మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి  మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివద్ధి పనులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో చేపడుతున్న అమత్ 2.0 పథకం కింద చేపట్టిన స్టోరేజ్ రిజర్వాయర్, నీటి సరఫరా పైప్ లైన్ పనులను పూర్తి చేయాలన్నారు. 15వ ఫైనాన్స్, సీఎం అష్యూరెన్స్ ఫండ్, జనరల్ ఫండ్ ఇతర మున్సిపల్ నిధులతో ఇప్పటికే చేపట్టిన చేపట్టిన పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో అమత్ పథకం కింద మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నిర్మాణపు పనులకు శంకుస్థాపన కొరకు సిద్ధం చేయాలన్నారు. గద్వాల్ ఆడిటోరియం పనులను పూర్తి చేయాలని, మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్ వంటి పనులను పూర్తి చేయాలన్నారు.  జనరల్ ఫండ్స్ ద్వారా మున్సిపల్ సిబ్బంది వేతనాలు, ఎలక్ట్రిసిటీ చార్జీలను వారం రోజుల్లో చెల్లించాలన్నారు.

సీఎం అస్సూరెన్స్ మిగులు నిధులతో సమ్మర్ వాటర్ ప్లాన్ క్రింద వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పనులను చేపట్టాలన్నారు.స్వచ్ఛ భారత్ నిధులతో అవసరమైన చోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పారదర్శకంగా రెండు రోజులలో పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు,  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఈ ఈ విజయ భాస్కర్ రెడ్డి,  మున్సిపల్ కమిషనర్లు, డిఇలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.