calender_icon.png 3 April, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

02-04-2025 08:27:28 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసి 100 శాతం పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టర్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పంచాయతీరాజ్ ఈ.ఈ., డి.ఈ.ఈ., ఎ.ఈ.ఈ. లతో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనుల పురోగతి, ఎం. బి. రికార్డులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు మంజూరైన సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో 100 శాతం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన గుత్తేదారులు, ఏజెన్సీలు పనులు పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితులలో అసంపూర్తిగా ఉండకూడదని తెలిపారు. పనులు పూర్తి అయిన వాటికి సంబంధించి ఫోటోలు, వివరాలతో ఎం. బి. రికార్డులు సిద్ధం చేసి డి. ఈ.ఈ.లు, ఎ. ఈ. ఈ. లు పనులు పూర్తి అయినట్లుగా ధ్రువపత్రం సమర్పించాలని తెలిపారు. ఈ నెల 5వ తేదీ లోగా పనులు పూర్తిచేసి ఎం. బి. రికార్డులు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ డివిజన్ల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, పంచాయతీరాజ్ ఈ. ఈ. ప్రభాకర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.