14-02-2025 12:00:00 AM
ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, ఫిబ్రవరి 13 (విజయక్రాం తి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన గ్రామాలలో ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ద్వారా జరుగుతున్న పనులు సంబంధిత ఇంజనీరింగ్ డీఈలు ఏఈలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత డీఈలు ఏఈలను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో ఇల్లందు సబ్ డివిజన్ ఇంజ నీరింగ్ విభాగము డిఈలు, ఏఈలతో డివి జన్లో జరుగుతున్న పనుల పురోగతిపై ఆయన మండలాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన పనులు పెం డింగ్లో లేకుండా ముఖ్యంగా కిచెన్ షెడ్ డైనింగ్ హాల్ తప్పనిసరిగా నిర్మాణం పూర్తి కావాలని, అదనపు తరగతి గదులు, పాఠ శాలల కాంపౌండ్ వాల్ పనులు పూర్తి స్థాయిలో జరగాలని, వైరాలో గిరిజన భవ నం, పాఠశాల డార్మెటరీ నిర్మాణానికి సం బంధించిన పనులు ఫిబ్రవరి 20వ తేదీ నాటికి పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.
పనుల పట్ల నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల చుట్టూ తిరగకుండా వేరే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గుండాల మండ లంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే సిబ్బంది నివాసగృహాల పనులు పూర్తయ్యలా చూడాలని, గిరిజన గ్రామాల లో జరుగుతున్న రోడ్డు పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం పనులు మార్చి 31 నాటికి పూర్తి కావాలని అన్నా రు. పురోగతిలో ఉన్న పనులు అన్ని పూర్త య్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్య క్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, డిఈ రాజు, ఏఈలు శ్రీకాంత్, హిమజ, విజయ్, మహేందర్ పాల్గొన్నారు.