calender_icon.png 10 January, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి: జోనల్

09-01-2025 10:43:48 PM

చార్మినార్ (విజయక్రాంతి): ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు సమన్వయoతో సకాలంలో పనులు పూర్తి చేయాలనీ జీ.హెచ్.యం.సి చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీ టీ. వెంకన్న ప్రాజెక్ట్స్, టౌన్ ప్లానింగ్ విభాగల అధికారులను ఆదేశించారు. జోనల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్, ప్రాజెక్ట్స్ విభాగం సమస్యలపై చాంద్రాయణగుట్ట నర్కిపూల్ బాగ్ లోని జోనల్ కార్యాలయంలో గురువారం జోనల్ కమిషనర్ వెంకన్న ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ... ప్రజవాణిలో అందిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్ల టౌన్ ప్లానింగ్ ఏసీపీ లు గజానంద్, స్వామి నాయక్, భాను చందర్, రాందాస్, మెహ్ర, శ్రీదేవి, ప్రాజెక్ట్స్ ఈఈ లు గోపాల్, శ్రీనివాస్ రావు, డిఈ లు, ఏఈ లు, టీపీఎస్ లు, ఎస్ఓ లు తదితరులు పాల్గొన్నారు.