12-03-2025 01:43:06 AM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి11 (విజయక్రాంతి) : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయితీ, హౌసింగ్ అధికారులు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఎ. పి. ఓ. లు, పంచాయతీ కార్యదర్శులతో అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.