జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్
ఎల్బీనగర్, జనవరి 21 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లోని వివిధ కాలనీల్లో మంగళవారం జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, కార్పొరేటర్ లచ్చిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించి, కాంట్రాక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. బీఎన్ నగర్ డివిజన్ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి కోరారు.
వైదేహి నగర్ సాయిబాబా ఆలయం నుంచి శివాలయం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరారు. సాహెబ్ నగర్ శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపాన్ని మరమ్మతులు చేయించి, రంగులు కోరారు. సాహెబ్ నగర్ లోని మహిళా సంక్షేమ సంఘం భవనానికి ప్రహరీ నిర్మించి, మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరారు.
గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీలో సీసీ రోడ్డు, సాహెబ్ నగర్ సబ్ స్టేషన్ నుంచి గాయత్రి నగర్ ఫేస్ 4 వరకు రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. సాహెబ్ నగర్ పెద్ద శ్మశాన వాటికను సుందరీకరణ చేయాలన్నారు. విజయపురి కాలనీలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఈఈ ఆశాలత, ఏసీపీ విజయశ్రీ, డీసీ దామోదర్ రావు, శానిటేషన్ డీఈ నీలిమ, హార్టికల్చర్ మేనేజర్ మేధ, ఏఈ రాజ్ కుమార్, టీపీఎస్ అక్బరుద్దీన్, శానిటేషన్ ఎస్‌ఎస్ అజీముద్దిన్, వైదేహి నగర్ కాలనీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీఎన్ రెడ్డి చౌరస్తాలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం
ఎల్బీనగర్, జనవరి 21 : ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రధాన ప్రతి నీళ్ళుపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు.
కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శివకుమార్ ఆధ్వర్యంలో బీఎన్ రెడ్డి నగర్ చౌరస్తా వద్ద మంగళవారం బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసుల పేరుతో వేధించడం సిగ్గుమాలిన చర్య అన్నారు.
కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సాయి నికేష్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు సాయిరాం రెడ్డి, నాయకులు సామాలెటి సాయి, కోటేష్ గౌడ్, దాడి రుత్విక్ రెడ్డి, దాసు మనోజ్, దుర్గేశ్, నేలపాటి రాజేశ్, అనిల్ కుమార్, శ్రీరాం యాదవ్, రమణారెడ్డి, శ్రీనివాస్, మధు గౌడ్, రాము గౌడ్, సాయికృష్ణ వైద్యం, చింటూ, చందు, రాహుల్, శివ పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
ఎల్బీనగర్, జనవరి 21 : ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సిఐ లక్ష్మీ సూచించారు. రోడ్డు భద్రతా మాస ఉత్సవాల సందర్భంగా మంగళవారం బండ్లగూడ డిపోలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
గేట్ సమావేశంలో ట్రాఫిక్ సిఐ లక్ష్మీ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. సమావేశంలో బండ్లగూడ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మేనేజర్ శభా షాలిని, అసిస్టెంట్ ఇంజనీరింగ్ బాలయోగేశ్వరి పాల్గొన్నారు.