calender_icon.png 29 April, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

28-04-2025 05:18:05 PM

చెన్నూరు ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని వివిధ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(Chennur MLA Vivek Venkataswamy) ఆదేశించారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి పనుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని పనులను నాణ్యతతో చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

ముఖ్యంగా వేసవిలో వార్డుల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డులో రహదారుల నిర్మాణం, డ్రైనేజీలు నిర్మించాలని, తాగునీటి సరఫరా, వీధి లైట్లు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యతపై రాజీపడోద్దని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.