24 May, 2026 | 8:29 PM

అభివృద్ధి పనులు మంజూరు చేయాలి

24-05-2026 07:05 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని పలు గ్రామపంచాయతీల సర్పంచులు ఆదివారం మాజీ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కలిసి తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు కేటాయించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ... గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, బోర్‌వెల్స్ తదితర అభివృద్ధి పనులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ డిసిసి విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకునేందుకు ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు.