ఎల్బీనగర్, ఫిబ్రవరి 1 : హయత్ నగర్ డివిజన్ పరిధిలో నిధులు కొరతతో అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో ఆలస్యమవుతున్నాయని కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి అన్నారు. డివిజన్ లోని షిరిడీ నగర్ కాలనీలో శనివారం కార్పొరేటర్ పర్యటించి, కాలనీవాసుల సమస్యలను తెలుసుకున్నారు.
కాలనీలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల సదుపాయం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఎంపీ రాజేందర్ సహకారంతో డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, జీహెచ్‌ఎంసీ ఉన్నత అధికారులతో మాట్లాడి సీసీ రోడ్ల నిర్మాణాలు చేయి స్తానని హామీ ఇచ్చారు.
కాలనీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, కాలనీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, విక్రమ్, వీర బాబు, రవీందర్, నర్సింగ్ రావు పాల్గొన్నారు. అనంతరం కమలానగర్‌లో లోతట్టు ప్రాంతాలైన పలు వీధుల్లో పర్యటించి, వరద నీటి కాలువలను కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, ఏఈ హేము నాయక్ పరిశీలించారు. వీరివెంట వర్క్ ఇన్ స్పెక్టర్ సురేశ్ ఉన్నారు.
ఏఈ హేము నాయక, వర్క్ ఇన్ స్పెక్టర్ సురేశ్, కాలనీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి, సభ్యులు జగన్మోహన్ రెడ్డి, శేషు కుమార్, సుధాకర్, శేషగిరి, సునీత, పద్మ తదితరులు పాల్గొన్నారు.