calender_icon.png 13 March, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్మన్ ఘాట్ ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం

13-03-2025 12:32:56 AM

దాతల సహకారంతో ఆలయాభివృద్ధి పనులు 

ఆలయం ఈవో లావణ్య 

ఎల్బీనగర్: కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ప్రారంభించారు. దాతలు జాలె నర్సింహా రెడ్డి, ప్రేమలత  తల్లిదండ్రులు స్వర్గీయ వెంకట్ రెడ్డి, ఆణ్డాలమ్మ  జ్ఞాపకార్థం వంటశాల ప్రాంగణంలో బండలు వేసే పనులు, దాతలు స్వర్గీయ డాక్టర్ కంచనాపల్లి రవీందర్ రావు, డి.ప్రకాశ్ రెడ్డి, బబ్బూరి ఆనంద్ కుమార్ గౌడ్ సహకారంతో రాజ గోపురం ఎదుట గ్రిల్స్ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేశారు. పూర్తయిన పనులకు ప్రత్యేక పూజల నిర్వహించి, ప్రారంభించారు.  ఈ సందర్భంగా  ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.లావణ్య మాట్లాడుతూ...   ఆలయ అభివృద్ధి పనులకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో  దాతలు జాలె నర్సింహ రెడ్డి, ప్రేమలత దంపతులు, జాలె తిలక్ రెడ్డి, శృతి దంపతులు, డి.ప్రకాశ్ రెడ్డి (రెడ్డి బ్రదర్స్), బబ్బూరి ఆనంద్ గౌడ్, ఆలయ వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.