calender_icon.png 16 February, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులు ప్రారంభం

15-02-2025 01:36:00 AM

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి పాల్గొని ప్రారంభించారు.

శుక్రవారం తుర్కయాంజాల్ రైతు సేవాసహకార సంఘం ఎఫ్‌ఎస్సిఎస్ వారు కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఆవరణలో రూ.3 కోట్ల 25 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు, 5 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాములు,1500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల కోల్ స్టోరేజీని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు.

అదేవిధంగా ఆదిభట్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ బ్యాంకు ప్రధాన కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, నియోజకవర్గంలోని పలు పిఎసీఎస్‌ల చైర్మన్‌లు, డైరెక్టర్‌లు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.