15-02-2025 01:44:12 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్ (విజయక్రాంతి), ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. రూ.5.50 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం ప్రారంభోత్సవాలు చేశారు.
నెక్నం పూర్, పుప్పాల గూడలో బస్తీ దవఖానాలను ప్రారంభించారు. వార్డ్ నెంబర్ 8, 18, 4, రూ.2.31 లక్షలతో కాళోజి పార్క్, కె పి ఆర్ పార్క్,అబ్దుల్ కలాం పార్కులలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రూ. 95 లక్షలతో వార్డు నెంబర్ 18 పుప్పాలగూడలో నిర్మించిన సీవరేజ్ లైను, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
రూ 30 లక్షలతో వార్డు నెంబర్ 11 నెమలి నగర్ లో నిర్మించిన బస్తీ దవఖానను ఎమ్మెల్యే ప్రారంభించారు. బస్తీ దవఖానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
పార్టీలకతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ధ్యేయంగా పనిచేయడం తనకు తెలుసని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ మణికొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.