calender_icon.png 18 January, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సహకారంతోనే అభివద్ధి

18-01-2025 12:00:00 AM

ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల, జనవరి 17 (విజయ క్రాంతి): ప్రజల సంపూర్ణ సహకారం ఉంటేనే పట్టణా భివద్ధి సాధ్యమని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్’కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 5, 20, 21, 37 వ వార్డులలో రూ. 80 లక్షలతో చేపట్టే అభివద్ధి పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లా డుతూ పట్టణ సమగ్ర అభివద్ధికి అన్ని వర్గాల ప్రజల సమిష్టి సహకారం తప్పక అవసరమన్నారు. చెరువులు, నాలాలు కబ్జా కాకుండా చూసే భాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలపై ఉందన్నారు. చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందని, మోతే, చింతకుంట చెరువుల మురుగు ప్రక్షాళనకు రూ. 5 కోట్ల 60 లక్షలతో ఎస్టీపీలు మంజూ రు చేయటం జరిగిందన్నారు.

చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జాకు గురైనా, వెంటనే సంబంధిత అధికారుల దష్టికి తీసుకురావాలన్నారు. వారు స్పందిం చకపోతే ఆ బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుందని, వారికి చెప్పాలన్నారు. సమస్య ఏదైనా ప్రజలు తమ బాధ్యతగా భావించి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వ యంగా ఉండి అవసరమైన పనులు చేయిం చుకోవాలని హితవు పలికారు.

జగిత్యాల ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిం చి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కషి చేస్తానన్నారు. అన్ని రంగాల్లో అభివద్ధి పరిచి, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే సంజయ్’కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్య క్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ అడువాల జ్యో తి లక్ష్మణ్, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సి లర్లు గుగ్గిళ్ళ హరీష్, అల్లె గంగాసాగర్, అను మల్ల కష్ణహరి, ఏఈ అనిల్, కో-ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.