calender_icon.png 15 January, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా

02-07-2024 05:51:50 AM

  • డిప్యూటీ సీఎం భట్టి 

ఖమ్మం, జూలై 1(విజయక్రాంతి): మధిరలో అభివృద్ధిని పరుగులు పెట్టించి, మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని, దీనికి ప్రతీ ఒక్కరు కంకణబద్దులవ్వాలని డీప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మధిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధిరకు త్వరలోనే ఐటీ హబ్ రానుందని, ఇందుకు కావల్సిన భూమిని సిద్ధం చేశామన్నారు.

పారిశ్రామిక సంస్థలను కూడా మధిరలో నెలకొల్పనున్నట్లు తెలిపారు. సిరిపురం గ్రామ సమీపంలోని ఎండ్రపల్లి గుట్టల వద్ద ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన యువకులు ముందుకు వస్తే ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పిస్తామన్నారు.