మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
రామాయంపేట జనవరి 26 (విజయక్రాంతి) ః మీ ఆదరణ, మీ ప్రేమ, ఆప్యాయతలు చూపి తనకు ఓట్లేసి గెలిపించి నందుకు ఈరోజు తాను ఎమ్మెల్యేగా విజయం సాధించి మీ ముందుకు వచ్చానని, మీ ఆకాంక్షలకు అనుగుణంగానే మెదక్ నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు..
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు రామాయంపేట మండలంలోని దామరచెరువు గ్రామంలో నాలుగు పథకాలను ఆయన ప్రారంభించారు.. మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి, గ్రామ తాజా మాజీ సర్పం పడాల శివప్రసాదరావు, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ లు యాదగిరి, చిలుక గంగాధర్, సుందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాతరావు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు కుస్తీ సిద్ధ రాములు, రాజా గౌడ్, స్వామి తో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.