calender_icon.png 27 December, 2024 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్తి సమాచారం ఉంటేనే అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయవచ్చు

07-11-2024 04:40:45 PM

ఇంటింటి సర్వేను సమగ్రంగా వేగవంతంగా చేయాలి

ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఏ శరత్

కామారెడ్డి (విజయక్రాంతి): పూర్తి సమాచారం ఉంటే అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి శరత్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. ఇంటింటి సమగ్ర సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ కుల సర్వే సమగ్రంగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని కోరారు. సర్వేలో ఆయా కుటుంబాలు అందించే వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సర్వే కోసం ఏర్పాటుచేసిన ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్ల వివరాలను అంతకుముందు కలెక్టర్ వివరించారు.

క్షేత్రస్థాయిలో సమిష్టిగా పని చేయడం వల్ల పనులు వేగవంతంగా పూర్తవుతాయని అన్నారు. సర్వేతో పాటు ఆన్లైన్ ఎంట్రీలు కూడా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ప్రతి చోట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

అంతేకాకుండా సన్న వడ్లు కొనుగోలుకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించడంతో పాటు ట్యాబు ఎంట్రీలు చేయడం ద్వారా ప్రగతి కనబడుతుందని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యమును వెంటనే మిల్లులకు రవాణా చేసేందుకు లారీ ట్రాన్స్పోర్ట్లతో సమావేశం నిర్వహించి తెలియజేయాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు రైస్ మిల్లర్లకు సహకరించాలని తెలిపారు.

రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేపడుతుందని తెలిపారు. మండల స్థాయిలో తాసిల్దార్లు కొనుగోలు సెంటర్లను సందర్శించాలన్నారు. తొలిత జిల్లాలకు కొనుగోలు చేస్తున్న ధాన్యం పంట వివరాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వివరించారు. జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఇందులో సన్న రకం వడ్లు కొనుగోలుకు 67 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 4,466 మంది రైతుల నుంచి 30,629 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

లారీల్లో ఆయా రైస్ మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ జరుగుతున్నదని తెలిపారు. గోనె సంచులు, ట్రాన్స్పోర్ట్, మిల్లర్ బ్యాంక్ గ్యారంటీ రైతులకు చెల్లింపు తదితరాంశాలపై వివరించారు. అంతకుముందు కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి శరత్ సందర్శించారు. రైతులతో మాట్లాడారు. రైతులు పంటను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. అనంతరం ఇంటింటి సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ తీరును ప్రత్యేక అధికారి కలెక్టర్ సందర్శించి స్టిక్కర్ పై నమోదు చేసిన వివరాలను గర్గుల్ గ్రామంలో పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్, ఆర్డీవో రంగనాథరావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహాయ పౌరసరఫరాల అధికారి నరసింహారావు జిల్లా సహకార అధికారి రామ్మోహన్ జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత స్థానిక తహసిల్దార్ లో ఎంపీడీవోలు ఇతర అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.