calender_icon.png 16 April, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

15-04-2025 12:54:32 AM

  1. బీఆర్‌ఎస్ నిలిపివేసిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి 
  2. ప్రజాపాలనను తీసుకువచ్చాం: మంత్రి శ్రీధర్‌బాబు 
  3. మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

మంచిర్యాల, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, సంక్షేమం, అభివృద్ధికే పెద్దపీట వేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంచిర్యాల ఐబీ స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్‌రావుతో కలిసి ఆవి ష్కరించారు.

పక్కనే నిర్మిస్తున్న మాతా, శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించారు. అనంతరం ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. సభలో భట్టి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా ప్రభుత్వ నిధులను దుర్విని యోగం చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు.

గోదావరి సమీపాన ముంపునకు గురయ్యే ప్రాం తంలో మాతా శిశు ఆసుపత్రి కట్టవద్దని కోరినా వినిపించుకోలేదని అన్నారు. పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చామని, అనుకున్న ట్లే నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్ధాంత రంగా నిలిపివేసిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంపై తనకు ఎంతో మమకారం ఉందని, తన నియోజకవర్గం మధిర ఎంతో మంచిర్యాల నియోజవర్గం కూడా అంతే అని చెప్పారు. రూ.765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని ఎమ్మెల్యేను కొనియాడారు. 

అనేక పథకాలు అమలు చేశాం: శ్రీధర్‌బాబు

కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోపే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమ లు చేసి ప్రజాపాలనను తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంచిర్యాల ను ఐటీహబ్‌గా మార్చుతామని, దీనికోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. మంచిర్యాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

యువతను ప్రోత్సహించేందుకు రాజీవ్ యువకిరణాలు పథ కం ప్రవేశపెట్టామని, ఎంతో మందికి ఈ పథకం దోహదపడనుందని అన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి కలెక్టర్ కార్యాలయం సమీపంలో హెలికాప్టర్‌లో వచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి శ్రీధర్‌బాబులకు కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు స్వాగతం పలికారు. 

డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.