calender_icon.png 14 January, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయాలు కాపాడితేనే అభివృద్ధి

14-01-2025 01:03:02 AM

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): సంప్రదాయాలను కాపా  గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్ శౠఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ అడవులను నమ్ముకొని ప్రత్యేక జీవనం కొనసాగిస్తామన్నారు. ఆచా  మూలాలను భావితరాలు ఆచరించేలా ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు.

సోమవారం జిల్లాలోని రెబ్బెన, ఆసిఫాబాద్, కెర  మండలాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసిన యోధుడు కుమ్రంభీం స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.

ఆదివాసీల హ  సాధనం భీం ప్రాణత్యాగంతోనే సా  అయిందన్నారు. జోడేఘాట్ ప్రాంతా  చారిత్రాక టూరిజం ప్రాంతంగా తీర్చిందిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీపం రూపంలో ఉన్న జంగుబాయి అమ్మను తమ కట్టుబొట్టుతో దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. జంగుబాయి క్షేత్రంలో రూ.50 లక్షలతో మౌళిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ క్షేత్రానికి సంబంధించిన భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, వెడ్మ బొజ్జు, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాబురావు, ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ చిత్తరంజన్, డీసీఆర్బీ డీఎస్పీ కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్ ఉన్నారు.