06-03-2025 01:00:26 AM
కరీంనగర్, మార్చి5(విజయక్రాంతి): ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో వ్యర్థాలతో వేస్టు టూ వండర్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీస్కుంటున్నట్లు కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ తెలిపారు. స్వ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా.... నగర సుంధరీకరణ నేపథ్యంలో బుధవారం రోజు కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అధికా రులతొ కలిసి నగరంలో పర్యటించారు. నగరంలోని అల్కపురి పార్కు, శ్రీనగర్ పార్కుతొ పాటు నగరపాలక సంస్థ పలు పార్కు స్థలలాను సందర్శించి... వేస్టు వండర్ పార్కు అభివృద్ధి కోసం స్థల పరిశీలన చేశారు. చెడిపోయిన వస్తువుల వ్యర్థాలతో పార్కును అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భాగంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వేస్టు టూ వండర్ పార్కు అభివృద్ధి కోసం స్థలం ఎంపిక చేసి... ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. నగరంలోని బొ మ్మకల్ ప్లు ఓవర్ వంతనెను సందర్శించి... అందమైన చిత్రాలు, బొమ్మలతో వాల్ పేయింట్ చేసేందుకు చర్యలు తీస్కోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.