calender_icon.png 24 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధి ప్రధాన ఎజెండా

23-01-2025 10:59:32 PM

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గ్రామాలను అభివృద్ధి పరచడమే ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. గురువారం సిర్పూర్ పి మండలం గోవింద్ పూర్, లక్ష్మీపూర్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా గ్రామాలలో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు లావణ్య, నాయకులు సత్తన్న, నాని, గురుదాస్, అశోక్, విలాస్, మహేష్, శేఖర్, బాపు, విశ్వనాథ్, సతీష్, మనోజ్ తదితరులున్నారు.