19-03-2025 07:18:21 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని రాయపోల్ బిజెపి మండల అధ్యక్షుడు మంకిడి స్వామి అన్నారు. బుధవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి, పెద్ద ఆరేపల్లి, కొత్తపల్లి గ్రామాలలో ఉపాధిహామీ నిధులతో సిసి రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో అంతర్గత రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ప్రజలకు సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇట్టి సమస్యను మెదక్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల మాజీ అధ్యక్షులు వెంకట్ గౌడ్, రాజా గౌడ్, బిజెపి నాయకులు సాయి, వేణు, చందు, వీరేష్, రాజు, బాలరాజ్, యాదగిరి, చింటూ, శ్రీకాంత్, మహేష్, గణేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.