calender_icon.png 12 January, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధి

05-01-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  2. వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష
  3. శివరాత్రి నాటికి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభించాలి

సిరిసిల్ల, జనవరి 4 (విజయ క్రాంతి) : ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ  అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మిని సమావేశ మందిరంలో  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి వేములవాడ ఆలయ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహిం చారు.

బద్ది పోచమ్మ ఆలయం రిన్నోవేషన్ పనులు, శివార్చన వేదిక నిర్మాణం, గుడి చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, వేములవాడ- కోరుట్ల, వేములవాడ - వట్టెంల  రోడ్డు విస్తరణ పనులు, మూడవ బ్రిడ్జి నుంచి రాజేశ్వర స్వామి దేవాలయానికి రోడ్డు విస్తరణ పనులు, భక్తులకు ఆధునిక వస్తువుల కల్పన, అన్నదానం భవన్ నిర్మాణం, అంబేద్కర్ జంక్షన్, జయవరం లేఔట్ అభివృద్ధి వంటి సుమారు 199.49 కోట్ల విలువ గల పనులపై ప్రభుత్వ విప్ సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ కార్యాల యంలో సామాగ్రి ఫర్నిచర్ కొనుగోలు చేయమని సంవత్స రం క్రితం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు చేయలేదని ఆలయ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి నాటికి అన్నదాన భోజన హల్, సమావేశ మందిరంలో నూతన ఫర్నీచర్ అందుబాటులో తీసుకుని రావాలన్నారు.

ఆలయం వద్ద భక్తుల వసతి కోసం సూట్ రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల వసతి దగ్గర పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిం చాలని, దోమలు వంటి సమస్యలు రాకుండా రెగ్యులర్ ఫాగ్గింగ్ జరగాలన్నారు. బద్ది పోచమ్మ ఆలయం వద్ద బోనాలు, పట్నాల మండపాలు, వేయిటింగ్ హల్ నిర్మాణా నికి 39 గుంటల భూమి సేకరించామని, 9 కోట్ల 90 లక్షల తో చేపట్టిన బద్ది పోచమ్మ రిన్నోవేషన్ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

గుడి చెరువు విస్తరణ కోసం 34 ఎకరాల పట్టా భూమి సేకరిం చామని, 12 కోట్లతో గుడి చెరువు మిని ట్యాంక్ బండ్ అభివృద్ధి, ఫ్యామిలీ థియేటర్, విగ్రహం, నీటి సరఫరా, విద్యుత్ ,ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్ ట్రాక్ పనులు శివరాత్రి కు ముందు  ప్రారంభం కావాలన్నారు.  ఒక తీరం వైపు భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలని, అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా మరో తీరం వైపు ఉండే విధంగా మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి జరగాలన్నారు.

అంబేద్కర్ జంక్షన్ వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించి, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. మూల వాగు బ్రిడ్జి నుంచి దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తి కావాలన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ దేవాలయం సంబంధించి సమావేశ మందిరం, భోజన హల్ లో అవసరమైన ఫర్నిచర్ కు వెంటనే షార్ట్ టెండర్ పిలిచి 3 రోజులలో కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.