calender_icon.png 2 February, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ హయాంలోని ఆలయాల అభివృద్ధి..

02-02-2025 06:36:24 PM

మాజీ మంత్రి జోగు రామన్న...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. నాగోబా జాతర సందర్భంగా ఆదివాసుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ లోని నాగోబాను ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయ కమిటీ సభ్యులు, మెస్రం వంశీయులు జోగు రామన్నకు తీర్ధప్రసాదాలు అందించి, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెస్రం పరమేశ్వర్, కుమ్ర శ్రీనివాస్, కుమ్ర రాజు, ఇజ్జగిరి నారాయణ, ధమ్మపాల్, కొండ గణేష్, సతీష్, రవీందర్, దేవిదాస్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.