calender_icon.png 25 November, 2024 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి

12-08-2024 01:26:37 PM

జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి

కొండపాక: కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లాలోని కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మార్స్ ఇండియా కంపెనీ సౌజన్యంతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఇఓ మాట్లాడుతూ జిల్లాలోని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చి సహాయం అందిచడం అభినందనీయమన్నారు.

విద్యార్థులకు యూనిఫామ్ ల వల్ల ఆత్మ విశ్వాసం పెంపొందుతుందని అలాగే మంచి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడానికి  అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులలో ఆత్మ న్యూన్యత భావం పోయి, ఆత్మస్థైర్యంతో  ముందడుగు వేస్తారని అన్నారు. విద్యార్థులు కష్టపడిచదవాలని మనం చేసే పని ఇష్టంతో చేస్తే సాధ్య కానిదంటూ ఉండదని సూచించారు. ఇంకా జీవితంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే లక్ష్యంతో చదవాలన్నారు. ఈ  కార్యక్రమంలో ఎంఈఓ  శ్రీనివాస్ రెడ్డి , ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్నమని, పిడి  భాస్కర్ రెడ్డి , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.