11-02-2025 12:20:35 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, ఫిబ్రవరి 10 ( విజయ క్రాంతి ) : హైబ్రి డ్ ఎన్యూనిటీ మోడ్ (హ్యామ్) లో కల్వకుర్తి నియోజకవర్గంలోని పంచాయతీ రాజ్ రోడ్లను అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో దేశంలోనే మొదటి సారిగా హ్యామ్లో కల్వకుర్తి రోడ్లను మాడల్ గా అభివృద్ధి పరిచి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామ న్నారు.
సోమవారం కడ్తాల్ మండల కేంద్రంలో రైతు వేదిక సమావేశ మంది రంలో కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల రైతులకు మొత్తం 416యూనిట్లకు గాను 51యూనిట్ల స్పిన్కర్లు పంపిణి ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైబ్రిడ్ ఎన్యూనిటీ మోడ్లో నియోజక వర్గంలోని పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు.
తాను నియోజక వర్గంలో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఎ న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే కోట్ల రూపాయలు మం జూరు చేయించామన్నా రు. ఆర్‌అండీబీ రోడ్లకు 189కోట్లు, పీఆర్ రోడ్లకు 91కోట్లు, ఇతర రోడ్లకు 15కోట్లు మంజూరు చే యించినట్లు తెలిపారు. హ్యామ్లో ప్రభుత్వం 40 శాతం నిధులిస్తూ మిగతా 60శాతం బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని తెలిపారు.
ఉనికి చాటుకోవడా నికే ప్రతిపక్షాల విమర్శలు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉనికి చాటుకో వడానికే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతీ నెల రూ.6500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా రైతులందరికీ అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు, బిటిరోడ్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి సురేష్, ఏడీఏ ఆదిలక్ష్మి, ఏవో శ్రీలత, పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బీక్యా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బిచ్యా నాయక్, నాయకులు హన్మ నాయక్, చేగూరు వెంకటేష్, నరేష్ నాయక్, బాల్ రాజ్, జహంగీర్ బాబా, అశోక్, హిర సింగ్, హెచ్‌ఓ సామ్య తదితరులు పాల్గొన్నారు.